: అమరావతి ప్రజలంతా గర్వించదగ్గ సమయమిది: చంద్రబాబు
ఈ ఉదయం మరో 30 స్మార్ట్ సిటీలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు నగరాలు ఎంపికయ్యాయి. ఏపీ నుంచి అమరావతికి, తెలంగాణ నుంచి కరీంనగర్ కు తాజా జాబితాలో చోటు దక్కింది. రాజధాని అమరావతికి స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇది అమరావతి ప్రజలందరికీ గర్వించదగ్గ సమయమని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న తిరుపతి, వైజాగ్, కాకినాడల సరసన అమరావతి నిలిచిందని ఆయన తెలిపారు.