: రానా కొత్త సినిమా ట్రైలర్ అదుర్స్: రకుల్ ప్రీత్ సింగ్


యంగ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వస్తోంది. జైల్లో సంకెళ్ల‌తో రానా క‌న‌ప‌డుతున్న తీరు, ఆయ‌న కొత్త‌ స్టైల్ అద్భుతంగా ఉన్నాయని అభిమానులు కొనియాడుతున్నారు. బాహుబలి-2లో పవర్ ఫుల్ పాత్రలో నటించిన అనంతరం రాగా దగ్గుబాటి నటిస్తోన్న ఈ సినిమాపై ద‌గ్గుబాటి అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ ట్రైలర్ ఉండ‌డంతో అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

 రానా కొత్త సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంద‌ని సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా ట్రైలర్ ‌పై స్పందిస్తూ విజిల్ వేసేలా ఉంద‌ని పేర్కొంది. చంపేయ్ జోగేంద్ర, నీ లుక్స్ అదుర్స్ అని ప్ర‌శంసించింది. ఈ సినిమాలో రానా త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించింది. ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News