: మరో 30 స్మార్ట్ సిటీలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. రూ. 57,393 కోట్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరో 30 స్మార్ట్ సిటీలను ప్రకటించింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ తాజా జాబితాలో 40 స్మార్ట్ సిటీలకు గాను 45 సిటీలు పోటీ పడ్డాయని... కానీ, కేవలం 30 సిటీలు మాత్రమే ఎంపికయ్యాయని చెప్పారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఈ నగరాలకు రూ. 57,393 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిలో రూ. 46,879 కోట్లు మౌలికవసతుల అభివృద్ది కోసం వినియోగిస్తారు. రూ. 10,514 కోట్లను గవర్నెన్స్ ను మెరుగుపరచడానికి అవసరమైన టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తారు. కొత్తగా ఎంపికైన 30 స్మార్ట్ సిటీలతో మొత్తం స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరుకుంది.