: మీరా కుమార్ ను బలిచ్చే మేకలా మార్చిన కాంగ్రెస్: బీజేపీ


లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దింపి, ఆమెను బలిచ్చే మేకలా కాంగ్రెస్ పార్టీ మార్చి వేసిందని బీజేపీ మండిపడింది. నేడు ఎన్డీయే తరఫున రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ వేయనుండగా, ఆ పార్టీ నేత ఎస్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. "తాము ఓడిపోతామని వారికి తెలుసు. మీరా కుమార్ స్పీకర్ పదవిలో ఎంతో ఉన్నతంగా నిలిచారు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిసి కూడా బలిస్తున్నారు" అని ఆయన విమర్శించారు.

ఓ దళితుడిపై మరో దళిత్ ను పోటీకి దింపడం ద్వారా సమాజాన్ని విడదీయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి రామ్ నాథ్ విజయం అత్యంత సులువని మరో బీజేపీ నేత ఎన్సీ షానియా అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న ఓ మహిళగా మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని తాను అభినందిస్తున్నానని, అయితే, కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని కూడా బేరీజు వేసుకుని ఉండాల్సిందని అన్నారు.

  • Loading...

More Telugu News