: ప్రీమియర్ షో రిపోర్ట్: 'డీజే'గా బన్నీ కేక అంటున్న ఎన్నారైలు!
డీజేగా బన్నీ అద్భుతంగా అలరించాడని ఎన్నారైలు పేర్కొంటున్నారు. అదుర్స్ లో బ్రాహ్మణ యాసలో జూనియర్ ఎన్టీఆర్ అలరించగా, అదే తరహాలో స్టైలిష్ స్టార్ ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన డీజే (దువ్వాడ జగన్నాథమ్) సినిమాలో అల్లు అర్జున్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అగ్రిడైమండ్ సంస్థ చేసిన స్కాం (కుంభకోణం) ను వెలికి తీసేందుకు బ్రాహ్మణ యువకుడిగా అవతారమెత్తిన బన్నీ తొలి అర్ధభాగం హాస్య సన్నివేశాలతో అలరించాడు.
తొలి అర్ధభాగం ముగియడానికి 20 నిమిషాల ముందు అసలు కథలోకి సినిమా ప్రవేశిస్తుందని, రెండో భాగం మొత్తం కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని బెనిఫిట్ షో చూసిన ఎన్నారైలు చెబుతున్నారు. కథ తెలిసిందే అయినా కథనం, కథను డీల్ చేసిన విధానం అద్భుతమని వారు చెబుతున్నారు. బన్నీ ఖాతాలో మరో విజయం పడిందని వారు చెబుతున్నారు. హీరోయిన్ కూడా సాధ్యమైనంతమేర ప్రేక్షకులను అలరించిందని, యథాశక్తి యువకులను అకట్టుకుందని తెలిపారు.