: కోహ్లీకి తనలాంటి అవినీతిపరుడంటేనే ఇష్టం!: కమల్ ఆర్ ఖాన్


టీమిండియా హెడ్ కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేయడంతో కోహ్లీపై అభిమానులంతా మండిపడుతున్నారు. కోహ్లీ వ్యవహారశైలి వల్లే కుంబ్లే పదవి నుంచి వైదొలిగాడంటూ, కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించి, ధోనీ లేదా రహానేకు కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ స్పందించాడు.

కోహ్లీకి కుంబ్లే నచ్చడని అన్నాడు. ఎందుకంటే, కుంబ్లే నిజాయతీపరుడని అన్నాడు. కోహ్లీ రవిశాస్త్రిలాంటి వ్యక్తినే ఇష్టపడతాడని చెప్పాడు. ఎందుకంటే, రవిశాస్త్రి కూడా కోహ్లీలా అవినీతిపరుడేనని చెప్పాడు. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓడిపోతుందని కమల్ ఆర్ ఖాన్ చెప్పినట్టే టీమిండియా ఓటమిపాలైంది. ఆ సమయంలోనే కోహ్లీ వల్లే జట్టు ఓటమి మూటగట్టుకుందని ఆరోపించాడు. కుంబ్లే పదవి నుంచి తప్పుకోవడం వెనుక కూడా కోహ్లీ ఉన్నాడని ఆయన పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News