: యోగా శిక్షకులకు భారీగా ఉద్యోగావకాశాలు!
యోగా శిక్షకులకు భారీగా ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా ఆయూష్ మంత్రిత్వ శాఖ(యోగ) ఉమ్మడి సలహాదారు ఈశ్వర ఆచార్య మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో దేశంలో యోగా శిక్షకుల సంఖ్య ముప్ఫై శాతం వరకు పెరిగిందని అన్నారు. ఇటీవలే హర్యానా ప్రభుత్వం వెయ్యి ఖాళీలను ప్రకటించిందని, సర్టిఫైడ్ యోగ శిక్షకుల అవసరం ఉన్న సంస్థలను గుర్తించాలని అన్ని రాష్ట్రాలకు తాము లేఖలు రాశామని చెప్పారు. ప్రస్తుతం యోగాకు ప్రాముఖ్యత పెరిగిందని, చాలా ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాల్లో యోగా శిక్షకులను నియమించుకుంటున్నట్టు చెప్పారు. సుమారు పదివేల మందికి పైగా యోగా శిక్షకులను నియమించాలని ప్రభుత్వ యోచిస్తోంది.