: కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి షరతు పెట్టిన రవిశాస్త్రి!
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీ కోరుకుంటున్న రవిశాస్త్రి కోచ్ పదవి కోసం ఈసారి దరఖాస్తు చేస్తాడని అందరూ భావిస్తున్నారు. అయితే, దరఖాస్తు చేయడానికి రవిశాస్త్రి ఓ మెలిక పెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గా నియమిస్తామని హామీ ఇస్తేనే తాను దరఖాస్తు చేస్తానని బీసీసీఐని ఆయన డిమాండ్ చేశాడు. సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన సలహా సంఘం తనను కోచ్ గా ఎంపిక చేస్తుందనే హామీని ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాడట.