: 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో 100 అడుగుల జాతీయ జెండాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణమని అన్నారు. జాతీయ జెండా స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం మనమంతా ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో 100 అడుగుల జెండాను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని చెప్పారు. జెండాను ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టు అధికారులను చంద్రబాబు అభినందించారు.