: జగన్ వార్నింగ్ తో రోజా మనస్తాపం... అందుకే మహాధర్నాకు గైర్హాజరు!
వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏ నిరసన దీక్ష నిర్వహించినా, పక్కనే ఉండే పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా, నేడు విశాఖపట్నంలో జరిగిన మహాధర్నాకు హాజరు కాకపోవడం వెనుక కారణాలేంటని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తిరుమలలో రోజా వ్యాఖ్యలపై దుమారం రేగిన అనంతరం జగన్ క్లాస్ తీసుకోవడంతో మనస్తాపానికి గురైన రోజా, నేటి మహాధర్నాకు గైర్హాజరైనట్టు అనుకుంటున్నారు.
ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితర ఎందరో నేతలు హాజరు కాగా, జగన్ వార్నింగ్ కారణంగానే రోజా డుమ్మా కొట్టారని వార్తలు వస్తున్నాయి. రోజాను జగన్ మందలించారన్న విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా, ఆమె విశాఖకు రాకపోవడం వెనుక మాత్రం ఏదో బలమైన కారణమే ఉండి వుండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా.