: 'కాలా' సెట్ లో దుర్ఘటన... సినీ కార్మికుడి మృతి
'కబాలి' సినిమా తీసిన పా రంజిత్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి 'కాలా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతగా రజనీ అల్లుడు ధనుష్ వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యే ముంబైలోని ధారవీ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం భారీ సెట్ నిర్మిస్తోంది. చెన్నైలోని హుండమల్లి ప్రాంతంలో ఈ సెట్ నిర్మిస్తుండగా సెట్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న సినీ కార్మికుడు ఒకరు విద్యుత్ఘాతంతో మృతి చెందాడు. దీంతో యూనిట్ విషాదంలో మునిగిపోయింది.