: మోదీ సర్కారు కీలక నిర్ణయం... యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు!


నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఓపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ముసాయిదా ప్రతిపాదనలను తయారుచేసి క్యాబినెట్ అనుమతి నిమిత్తం పంపింది. ఉద్యోగాల్లో ఖాళీలు, ప్రమోషన్ల కోటా, వయోపరిమితి సడలింపు తదితరాంశాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. కాగా, ఈ ప్రతిపాదనలకు న్యాయ పరమైన అడ్డంకులు ఎదురు కావచ్చని అంచనా.

ఇప్పటికే అంగవికలురకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున, ఈ ముసాయిదాపైనా కొందరు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రత్యక్ష నియామకాలు జరిపే విభాగాల్లో నాలుగు శాతం ఖాళీలను యాసిడ్ దాడి బాధితులకు, దివ్యాంగులకు కేటాయించాలని డీఓపీటీ ప్రతిపాదించింది. అంధత్వం, పాక్షిక అంధత్వం, బధిరత్వం, పాక్షిక బధిరత్వం తదితరాలతో బాధపడుతున్న వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంది. దీనిపై వచ్చే 15 రోజుల్లోగా అన్ని ప్రభుత్వ విభాగాలూ సలహా, సూచనలు ఇవ్వాలని కోరింది.

  • Loading...

More Telugu News