: చైతూ సినిమా కోసం బోయపాటికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్!


కమర్షియల్, మాస్ సినిమాలను రూపొందించడంలో దర్శకుడు బోయపాటి దిట్ట అనే విషయం తెలిసిందే. మాస్ ఇమేజ్ కావాలనుకునే హీరోలు బోయపాటి సినిమాలో నటించాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే అక్కినేని నాగచైతన్య 'రారండోయ్ వేడుకు చూద్దాం' సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అభిమానులను అలరించే మాస్ సినిమా చేయాలని చైతూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట.

దీంతో, వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించడానికి అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధమైంది. ఈ సినిమా కోసం బోయపాటికి ఏకంగా రూ. 12 కోట్లు ఆఫర్ చేశారనేది ఫిలింనగర్ టాక్. మరోవైపు అఖిల్ రెండో సినిమా కోసం కూడా బోయపాటిని నాగార్జున సంప్రదించారట.

  • Loading...

More Telugu News