: మహాధర్నాలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న వైఎస్ జగన్!


విశాఖపట్నం నగరం కబ్జారాయుళ్ల చేతుల్లో చిక్కుకుందని ఆరోపిస్తూ, 'సేవ్ విశాఖ' పేరిట చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఆయన 9.30 గంటలకు విశాఖ చేరుకోగా, వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

ఆపై జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ బొమ్మ వద్ద ప్రారంభమైన ధర్నాలో పాల్గొనేందుకు జగన్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ధర్నాలో ప్రసంగించిన అనంతరం గెస్ట్ హౌస్ కు వెళ్లే ఆయన, స్థానిక నేతలతో కాసేపు మాట్లాడి, తిరిగి సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మూడు రోజులుగా విశాఖలో మకాం వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News