: శిరీషను నమ్మినవాళ్లే వంచించారు... ఆధారాలు సేకరించిన పోలీసులు!


శిరీషను నమ్మనవాళ్లే వంచించారనేందుకు బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే... బ్యూటీషియన్ శిరీష, కుక్కునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై పూర్తి క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ లో ఉన్న శ్రావణ్, రాజీవ్ లను ఐదురోజుల కస్టడీకి పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కెరీర్ పరంగా శిరీషకు సహకరించే నెపంతో రాజీవ్ ఆమెతో బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే, తేజస్వినితో ప్రేమలో పడ్డాక, ఆమెను పెళ్లి చేసుకునేందుకు శిరీషను వదిలించుకోవాలని చూశాడు. స్నేహం పేరుతో శిరీషతో పరిచయం పెంచుకున్న శ్రావణ్... ఆమెను ఏరవేసేందుకు వ్యూహాలు రచించాడు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఎస్సై అత్యాచారయత్నం చేశాడు. ఇలా శిరీష నమ్మినవారంతా ఆమెను వంచించారు. దీనిపై ఆధారాలను పోలీసులు సేకరించారు.

ఆమెకు వ్యతిరేకంగా శ్రావణ్ వ్యవహరించాడనడానికి కావలసిన ప్రాధమిక ఆధారాలను బంజారాహిల్స్‌ పోలీసులు సేకరించారు. అంతే కాకుండా శ్రావణ్, ఎస్సై ప్రభాకర్‌ రెడ్డితో మాట్లాడిన కాల్స్‌ సంఖ్యను కూడా గుర్తించారు. ఈ కాల్స్ లో ‘అన్నా! శిరీష లీడింగ్‌ బ్యుటీషియన్‌. ఆమెకు ఫేవర్‌ చేస్తే మనకు భవిష్యత్‌ లో బాగా పనికొస్తుంది. శిరీషను తీసుకొస్తా, మీరు చూసి డిసైడ్‌ చేయండి’ అంటూ ఎస్సైతో చెప్పిన ఆధారాలు సేకరించారు.

అదే సమయంలో శ్రావణ్, రాజీవ్‌ తో ‘శిరీషను వదిలించుకోవడం నీకు ఇష్టమేనా? ఇందుకు ఎస్సైకి కొంత ఫేవర్‌ చేయాలి’ అని శ్రవణ్‌ ముందుగానే చెప్పినట్టు తెలుస్తోంది. తేజస్వినిని పెళ్లిచేసుకోవాలన్న ఆలోచనతో రాజీవ్‌, శిరీషను వదిలించుకునేందుకు సిద్ధపడి, ఎస్సైకి సహకరించినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏదో జరిగిందని, ఏం జరిగిందన్నది రాబట్టేందుకు వారిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని వారు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News