: ట్రినిడాడ్ చేరుకున్న కోహ్లీ సేనకు ఘన స్వాగతం!


ఇంగ్లాండ్ నుంచి నేరుగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు ట్రినిడాడ్ లో దిగింది. అక్కడి నుంచి భారత జట్టు తమ బస ఏర్పాటు చేసిన హోటల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీకి వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ స్వాగతం పలికాడు. అనంతరం, ఇద్దరు కెప్టెన్ లు కొంచెం సేపు ముచ్చటించుకున్నారు. కాగా, వెస్టిండీస్ జట్టుతో 5 వన్డేలు, ఒక టీ 20 మ్యాచ్ ని టీమిండియా ఆడనుంది. ఈ నెల 23 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరగనున్న తొలి మ్యాచ్ లో రెండు జట్లు తలపడనున్నాయి.

  • Loading...

More Telugu News