: జాతీయ పతాకానికి అగౌరవం: పుదుచ్చేరి ముఖ్యమంత్రి కారు డ్రైవర్ సస్పెన్షన్!
కారుకు త్రివర్ణ పతకాన్ని తలకిందులుగా అమర్చడంతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి అధికారిక కార్ డ్రైవర్ సస్పెండ్ అయ్యాడు. ఆ డ్రైవర్ పుదుచ్చేరి సర్కారు శాశ్వత ఉద్యోగిగా ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నాడు. నిన్న సాయంత్రం చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లడానికి నారాయణ స్వామి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఆ సమయంలోనే సీఎం ఈ విషయాన్ని గమనించారు. కారులోంచి దిగి వెంటనే ఆయనే స్వయంగా జాతీయ జెండాను సరిగా అమర్చారు. జాతీయ జెండా ఎలా ఉండాలో కూడా తెలియదా? అంటూ ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.