: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ చేసిన సిద్ధరామయ్య
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ తమ పార్టీనే గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రైతుల రూ.8,167 కోట్ల రుణాలను మాఫీ చేసేస్తామని ప్రకటన చేశారు. గతంలో తమ రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రూ.50వేల లోపు తీసుకున్న రైతు రుణాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో రుణమాఫీ అంశంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, అది తమ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. తాజాగా సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో లబ్ధి పొందనున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.