: ఇటువంటి వార్తలు నమ్మకండి.. నెక్ట్స్ ఏంటో నేనే స్వయంగా చెబుతాగా!: రానా


తన అభిమానులు నెక్ట్స్ ఏంటీ? నెక్ట్స్ ఏంటీ? అంటూ త‌న త‌దుప‌రి సినిమా గురించి అడుగుతుండ‌డంతో ద‌గ్గుబాటి రానా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. దానికితోడు సోష‌ల్‌ మీడియాలో రానా నెక్ట్స్ మూవీ ఇదేనంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుండడంతో
ఆయన స్పందించాడు. ముఖ్యంగా తాను వీవీ వినాయక్ దర్శకత్వంలో న‌టించబోతున్నట్టుగా వార్తలు వ‌స్తున్నాయ‌ని తెలుసుకున్న రానా... తాను ఏ సినిమా చేయాలనుకుంటున్నానో ఆ విష‌యం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తానని, ఇలాంటి రూమర్స్ ను మాత్రం నమ్మకూడ‌ద‌ని అభిమానుల‌ను కోరాడు. ప్ర‌స్తుతం రానా ద‌ర్శ‌కుడు తేజ రూపొందిస్తోన్న‌ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న విష‌యం తెలిసిందే.       

  • Loading...

More Telugu News