: 'ఇండియా ముర్దాబాద్' అన్న తన అభిమానికి చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చిన రితీశ్!
ఈ శుక్రవారం నాడు తాను నటించిన 'బ్యాంక్ చోర్' చిత్రం విడుదల కానున్న వేళ, బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్, ఇండియాను అగౌరవపరిచిన తన అభిమానికి గౌరవంగా చెంపదెబ్బ లాంటి సమాధానాన్ని ఇచ్చాడు. వహీదుల్లా అనే పాక్ అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో ఇండియాను 'ముర్దాబాద్' అన్నాడు. అతను రితీశ్ కు ట్విట్టర్ ఫ్రెండ్ గా ఉండటంతో, అది రితీశ్ కు చేరింది. మధ్యాహ్నం 2:37 గంటలకు వహీదుల్లా ట్వీట్ పెట్టగా, ఆపై రెండు నిమిషాల్లోనే రితీశ్ స్పందించాడు. "సార్... నిన్ను బ్లాక్ చేస్తున్నాను. నా దేశం గురించి ఎన్నడూ ఏమీ మాట్లాడవద్దు. నీ జీవితం బాగుండాలి. జై హింద్" అని ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ వైరల్ అయి, వందల సంఖ్యలో షేర్లను, వేల సంఖ్యలో లైక్స్ ను తెచ్చుకుంది.