: పాక్ తో ఫైనల్ మ్యాచ్ కి ముందు కుంబ్లేను తిట్టిన కోహ్లీ... సంచలన విషయం వెలుగులోకి!
భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తరువాత విరాట్ కోహ్లీ వైఖరిపై సీనియర్ క్లికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న వేళ, మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ముందు జరిగిన టీమ్ సమావేశంలో కోహ్లీ, కుంబ్లేను తిట్టాడని విశ్వసనీయ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కుంబ్లే రాజీనామాకు అది కూడా ఓ కారణం కావచ్చని, కుంబ్లేతో 'ఇక నీ సేవలు చాలని' వాదనకు దిగిన కోహ్లీ ఓ దశలో నోరు జారాడని తెలిపాయి. టీమ్ మొత్తం కుంబ్లే కోచ్ గా ఉండటాన్ని ఇష్టపడటం లేదని కూడా కోహ్లీ అన్నాడని, దాంతో మనస్తాపం చెందే కుంబ్లే రాజీనామా ఇచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.