: కడప జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు!
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేటకు చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి, టీడీపీలో చేరిపోయాయి. వైసీపీ నేత పిడుగు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, వీరంతా టీడీపీలో చేరారని చెప్పారు. ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో వైసీపీకి చెందిన ఎంతోమంది టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడిన ఏకైక పార్టీ టీడీపీనే అని చెప్పారు.