: ఈ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు విజయ్ కోసం మరో సినిమా ఉచితంగా చేస్తా!: జయం రవి బంపర్ ఆఫర్
‘వనమగన్’ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు విజయ్ కోసం మరో సినిమాలో ఉచితంగా నటిస్తానని తమిళనటుడు జయం రవి తెలిపాడు. ‘వనమగన్’ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో మాట్లాడుతూ, తన తండ్రి తరువాత తనపై అంత ఖర్చు చేసిన దర్శకుడు విజయ్ అని చెప్పాడు. అందుకే ఈ సినిమా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
ఒకవేళ దురదృష్టవశాత్తు సినిమా ఫ్లాప్ అయితే విజయ్ చేసే మరో సినిమాలో ఉచితంగా నటించేందుకు వెనుకాడనని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం అడవుల్లో జరిగిందని, ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకడం, సినిమా కోసం చర్మం రంగు మార్చుకోవడం చాలా కష్టంగా అనిపించిందని అన్నాడు. ఈ సినిమాలో తనకు ఎలాంటి డైలాగులు ఉండవని, సినిమా మొత్తం అడవి మనిషిలా ఉంటానని చెప్పాడు. కాగా, ఈ సినిమాలో జయం రవి సరసన సాయేషా నటిస్తోంది.