: ‘చిన్నమ్మ’ చెప్పిన వారికే అన్నాడీఎంకే మద్దతు.. రాష్ట్రపతి అభ్యర్థిపై దినకరన్ మాట!


బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న పార్టీ చీఫ్ వీకే శశికళ చెప్పిన వారికే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై, అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ  టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. మంగళవారం వారిద్దరూ కలిసి జైలులో ఉన్న శశికళను కలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ శశికళతో తాము రాజకీయాల గురించి చర్చించలేదని, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు మద్దతు విషయమై చర్చించినట్టు తెలిపారు. ఈ విషయంలో ఆమె నిర్ణయం మేరకే తమ మద్దతు ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా, శశికళ జైలుకు వెళ్లిన తర్వాత తంబిదురై ఆమెను కలుసుకోవడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News