: బ్రసెల్స్‌లో ఉగ్రదాడి.. 'అల్లాహు అక్బర్' అంటూ దాడికి దిగిన ఉగ్రవాది.. కాల్చివేత!


బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ను మరోమారు ఉగ్రదాడి కుదిపేసింది. అనుమానిత ఉగ్రవాది ఒకరు మంగళవారం రాత్రి అల్లాహు అక్బర్ (దేవుడు గొప్పవాడు) అంటూ పేలుడుకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదిని కాల్చి చంపారు. స్టేషన్‌లో చిన్న పేలుడు సంభవించిందని, పోలీసులు అనుమానిత ఉగ్రవాదిని కాల్చి చంపారని ఫెడరల్ పోలీస్ అధికార ప్రతినిధి పీటర్ డి వేలె తెలిపారు. నవంబరు 2016లో బ్రసెల్స్ ఎయిర్‌‌పోర్ట్, మెట్రో స్టేషన్‌లలో జరిగిన బాంబు పేలుళ్లలో 32 మంది మృతి చెందారు. ఆ ఘటనకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. అదే ఏడాది నవంబరు పారిస్‌లో జరిగి ఉగ్రదాడిలో 130 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News