: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలనం!
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. నిందితులు రాజీవ్, శ్రవణ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న రోజున శిరీష ధరించిన డ్రెస్ పై మరకలు ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో అనే విషయం ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.