: బొమ్మ అనుకుని పాముని పట్టుకుంది.. మీరూ చూడండి!
రాత్రిపూట ఓ గేటు ముందు ఉన్న ఓ పాముపిల్లను చూసి ఆటబొమ్మ అనుకుంది ఓ మహిళ. దాన్ని పట్టుకోగానే ఒక్కసారిగా ఆ పాము పిల్ల కదలడంతో ఆమె భయపడిపోయి పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ.. బొమ్మ అనుకుని పాముపిల్లను పట్టుకుంది. ఆ సమయంలో ఆమె పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. ఆ మహిళ పరుగులు పెట్టడంతో ఆ కుక్క కూడా ఆమెతో పాటే పరుగులు తీసింది. ‘ఆమె పరుగుతీసిన విధానం ఫన్నీగా ఉన్నా.. తాను పట్టుకున్నది పాముపిల్లని తెలుసుకున్నప్పుడు ఆ మహిళ ఎంతగా భయపడిపోయిందో’ అని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.