: ప్రభాస్ ను కట్టప్ప స్టైల్లో కత్తితో పొడిచిన బాలీవుడ్ హీరో!


ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ నిన్న రాత్రి ముంబైలో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి రానాతో పాటు, బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో బాలీవుడ్ నటులంతా చాలా సరదాగా కలసిపోయి, ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ లో నటిస్తుండటంతో, ఆల్రెడీ వీరందరితో రానాకు మంచి పరిచయాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, బాహుబలిని కట్టప్ప పొడిచిన విధంగా... ప్రభాస్ ను బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ పొడిచాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేశాడు. "కట్టప్ప ఇంతకు ముందు చేసిన దాన్నే ఇప్పుడు నేను చేశా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, బలవంతుడు. అయితే ఇప్పుడు ఆయన కత్తి నా వద్ద ఉంది" అంటూ ట్వీట్ చేశాడు. 

  • Loading...

More Telugu News