: ఐవైఆర్ కృష్ణారావులాంటి పెద్దమనిషి ఇలా చేస్తారా?.. ఏ పార్టీ, ఏ సామాజికవర్గం దీన్ని హర్షించదు : బొండా ఉమ విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు వైఖరి పట్ల టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఐవైఆర్ చేసిన పని తమను ఎంతో బాధకు గురి చేసిందని ఉమ అన్నారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న పెద్ద మనుషులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దురదృష్టకరమని తెలిపారు. ఐవైఆర్ చేసిన పనిని ఏ పార్టీ కాని, ఏ సామాజిక వర్గం కానీ హర్షించదని చెప్పారు. ఆయన పెట్టిన పోస్టింగులను కూడా ఫేస్ బుక్ నుంచి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి దారుణమైన పోస్టింగులను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో... వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.