: శ్రుతి మించిన షోయబ్ అక్తర్ మేకప్!
జియో టీవీ ప్రసారం చేసే ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ మేకప్ కాస్త శ్రుతి మించడంపై విమర్శలు వచ్చిపడుతున్నాయి. తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల కారణాలను ఈ టీవీ షోలో అక్తర్ వివరించాడు. అయితే, పెదాలకు, కనురెప్పలకు, ముఖానికి వేసుకున్న మేకప్ కొంచెం ఎబ్బెట్టుగానూ, శ్రుతి మించి మరీ ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ షోను తిలకించిన నెటిజన్లు అక్తర్ పై విమర్శలు గుప్పించారు. ‘ఇంతగా మేకప్ చేసుకోవడం అవసరమా?’ అంటూ ప్రశ్నించారు.