: ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్‌లలా బన్నీ డ్యాన్స్’ అదుర్స్... డీజే ‘సీటీ మార్’ పాట ట్రైలర్ విడుదల
విడుదలకు సిద్ధమైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోని ‘సీటీ మార్’ అనే పాట ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో అల్లు అర్జున్, పూజా హెగ్డే చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. ‘మెరిసే మెరుపా, సొగసే అరుపా.... ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్’ అంటూ సాగే ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్‌ల స్టెప్పులు కూడా వేసి చూపించాడు. 31 సెకన్ల నిడివితో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.