: రాష్ట్రపతి అభ్యర్థిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు: గులాంనబీ ఆజాద్


రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎన్డీయే ఎంపిక చేసిన రాష్ట్రపతి అభ్యర్థిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని, ఎన్డీయే ఈ నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన విపక్ష పార్టీలతో మాట్లాడి వుంటే బాగుండేదని అన్నారు. ఈ నెల 22న సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ఈ సమావేశం విషయమై ఇప్పటికే విపక్ష పార్టీలకు సమాచారం అందించామని, ఇప్పటివరకు విపక్షాలన్నీ ఏక తాటిపై ఉన్నాయని, 22వ తేదీన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News