: మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్ రికార్డును తిరగరాసిన పాండ్యా


ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఈ రికార్డును పాండ్యా సాధించాడు. ఆసీస్ మాజీ ప్లేయర్ గిల్ క్రిస్ట్ పేరిట గతంలో నమోదైన రికార్డును పాండ్యా అధిగమించాడు. నిన్నటి మ్యాచ్ లో పాండ్యా కేవలం 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టాడు. కాగా,1999లో ఐసీసీ నిర్వహించిన ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ పై గిల్ క్రిస్ట్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ రికార్డును పాండ్యా తిరగరాయడంపై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News