: సోదరా కోహ్లీ, నువ్వు ఫిక్సింగ్ కు పాల్పడ్డావు!: బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కేఆర్కే


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కోహ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని, అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతన్ని బహిష్కరించాలని, జైలుకు పంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు.

‘సోదరా కోహ్లీ, నువ్వు ఇచ్చిన క్యాచ్ ను పాకిస్థాన్ ఫీల్డర్లు వదిలేశారు. ఆ తర్వాతి బంతికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్ కు పాల్పడ్డావని స్పష్టంగా అర్థమైంది. భారతీయుల ప్రతిష్టను పాకిస్థాన్ కు అమ్మేసిన కోహ్లీపై జీవితకాల నిషేధం విధించాలి .. జైలుకు పంపాలి. కోహ్లీతో పాటు యువరాజ్ సింగ్, ధోనీ కూడా ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు..’ అంటూ కేఆర్కే తన ఇష్టానుసారం ఆరోపణలు చేశాడు. అయితే, కేఆర్కే ఆరోపణలపై భారత్, పాక్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News