: వేరే ప్రార్థనా మందిరంపై కాషాయ జెండా.. తీవ్ర కలకలం
వేరే మతానికి చెందిన ప్రార్థనా మందిరం మీద కాషాయ జెండా కట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగింది. నిన్న తెల్లవారే సమయానికి కాషాయ జెండా తమ ప్రార్థనా మందిరంపై ఉండటంతో... ఆ వర్గానికి చెందినవారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ కొడిమ్యాలకు చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.