: భారత్ ఘోర పరాజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ కైవసం!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తొలిసారిగా పాకిస్థాన్ దక్కించుకుంది. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ విజయం సాధించింది. భారత్ పై 180 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే.. 30.3 ఓవర్లలోనే భారత ఆటగాళ్లందరూ ఔటయ్యారు. కాగా, నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాక్.. టీమిండియాకు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించడంతో బరిలోకి దిగిన భారత జట్టు ఘోర పరాజయం పాలైంది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఘన చరితగల మన బ్యాట్స్ మెన్ ఒకరిని చూసి మరొకరు చేతులెత్తేశారు. ఏ దశలోనూ కూడా మన టాపార్డర్ బ్యాట్స్ మేన్ పోరాటపటిమ చూపించలేకపోయారు. ఇన్నాళ్లు నిలకడ లేమితో సతమతమైన పాక్ ఆటగాళ్లు మాత్రం అటు బ్యాటింగులోను, ఇటు బౌలింగులోను కూడా సమష్టిగా రాణించి, తమ దేశానికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. అందరూ ఔటైపోతున్న తరుణంలో.. అంత ఒత్తిడిలోనూ నిలబడి ఆర్దిక్ పాండ్యా 76 పరుగులు చేయడం మాత్రం ఒక విశేషమనే చెప్పాలి.
భారత్ స్కోరు:
రోహిత్ శర్మ (0), ధావన్ (21), విరాట్ కోహ్లీ (5), యువరాజ్ సింగ్ (22), ధోనీ (4), జాదవ్ (9), పాండ్యా(76), జడేజా (15), అశ్విన్ (1), బుమ్రా (2), భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు.
పాక్ బౌలింగ్:
మహ్మద్ అమీర్ - 3, హసన్ అలీ - 3, షాదాబ్ ఖాన్ - 2, జునైద్ ఖాన్-1