: అదనపు కట్నం కోసం భార్యను కొరివితో చితకబాది, యాసిడ్ పోసిన భర్త!


అదనపు కట్నం కోసం బరితెగించాడో భర్త. కొరివితో భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోసి వికృతానికి తెగబడ్డాడు. కేరళలోని అలాపుఝా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. 31 ఏళ్ల భార్యపై భర్త, అత్త తరచూ ఘర్షణకు దిగేవారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ చావబాదేవారు. 9 ఏళ్ల క్రితం తమ వివాహం జరిగిందని, వివాహ సమయంలో రెండు లక్షల రూపాయలు, 20 నాణేల బంగారాన్ని కట్నంగా ఇస్తామని తన తల్లిదండ్రులు హామీ ఇచ్చినట్టు బాధిత మహిళ తెలిపింది.

అయితే కేవలం బంగారం మాత్రమే ఇవ్వడంతో తనకు వేధింపులు మొదలయ్యాయని వివరించింది. జూన్ 6 మహిళ భర్త కాలుతున్న కట్టెతో ఆమెను చితకబాదాడు. అనంతరం తీవ్ర గాయాలపాలై నేలపై పడి ఉన్న ఆమెపై యాసిడ్ పోశాడు.  అయితే ముఖంపై యాసిడ్ పడకుండా ఆమె తప్పించుకోగలిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో భర్త, అత్తపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News