: ఒకేరోజు రెండు 'విందు'లు.. పాక్‌ పని పట్టేందుకు సిద్ధమవుతున్న భారత్ క్రికెట్, హాకీ జట్లు!


నేడు క్రీడా ప్రేమికులకు పండుగ లాంటి రోజు. కావాల్సినంత మజాను ఆస్వాదించవచ్చు. దాయాది పాక్‌తో ఒకే రోజు రెండు క్రీడల్లో భారత్ పోటీ పడనుంది. అందులో ఒకటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాగా మరోటి హాకీ. రెండు మ్యాచ్‌లు ఒకే దేశంలో అది కూడా పది మైళ్ల  దూరంలోనే జరగనుండడం విశేషం. క్రికెట్ ఫైనల్ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఓవల్‌ మైదానంలో జరగనుండగా, రివర్ బ్యాంక్ ఎరీనాలో పాక్ హాకీ జట్టు మెడలు వంచేందుకు హర్మన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని హాకీ జట్టు ఉత్సాహంతో ఎదురుచూస్తోంది.

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. తానెప్పుడూ హాకీ ఆడలేదని, కాకపోతే నెట్స్‌లో సింథటిక్ హాకీ బంతులతో ప్రాక్టీస్ చేస్తుంటానని, హాకీ అంటే తనకు భయమని, అది ఆడాలంటే చాలా గుండె ధైర్యం కావాలని పేర్కొన్నాడు. పాక్‌తో తలపడుతున్న భారత్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పాడు. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్)లో భాగంగా నేడు జరగనున్న సెమీ ఫైనల్స్‌కు బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. హాకీ మ్యాచ్ ముగిసిన అనంతరం వారు క్రికెట్ ఫైనల్స్‌కు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News