: నంద్యాల ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి.. ఖరారు చేసిన చంద్రబాబు!
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గ సీటు కోసం టీడీపీ నుంచి అభ్యర్థిని ఖరారు చేశారు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో సీటు కోసం టీడీపీ నేతల్లో పెద్ద పోరే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.