: ఈ ఏడాది ఖైరతాబాద్‌లో శ్రీచండీకుమార మహాగణపతిగా దర్శనమివ్వనున్న గణేశుడు
వినాయక చవితి అనగానే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడే. అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడి భారీ విగ్రహం ప్రపంచ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. గతేడాది శివనాగేంద్రుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన గణేశుడు.. ఈ ఏడాది శ్రీచండీకుమార మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. గత ఏడాది కంటే ఈ ఏడాది మరో ఒక అడుగుతగ్గించి 57 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహానికి కుడివైపున మహా శివుడు, ఎడమ వైపున మహిషాసురమర్ధిని రూపాలను ఉంచుతున్నారు. ప్రతిఏడాది ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఎత్తును పెంచుకుంటూ పోయిన ఉత్సవ కమిటీ గత మూడేళ్ల నుంచి ఒక్కో ఎత్తును తగ్గించుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.