: చైనీస్ భాషలోకి డబ్ అవుతున్న దక్షిణాది సినిమా!
చైనా భాషలో విడుదలైన అమీర్ ఖాన్ చిత్రం 'దంగల్'... అక్కడ దుమ్ము రేపుతోంది. మన తెలుగు బ్లాక్ బస్టర్ 'బాహుబలి' కూడా అక్కడ విడుదల కావడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో, మరో దక్షిణాది సినిమా చైనాలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మోహన్ లాల్, మీనాలు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు.
తాజాగా ఈ సినిమాను చైనీస్ భాషలోకి డబ్ చేసే ప్రయత్నాల్లో ఆ సినిమా నిర్మాత ఆంటోనీ పెరుంబర్ ఉన్నాడని సమాచారం. 'దంగల్' స్ఫూర్తితో మన దేశానికి చెందిన పలు సినిమాలను చైనాలో విడుదల చేయాలని నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు.