: 'బాహుబలి' రికార్డును అధిగమించనున్న సల్మాన్ 'ట్యూబ్ లైట్'
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ట్యూబ్ లైట్’ సినిమా రంజాన్ కానుకగా జూన్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 'బాహుబలి' రికార్డును బద్దలు కొట్టనుంది. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా 9000 ధియేటర్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ 'ట్యూబ్ లైట్' ను 'బాహుబలి'ని మించి 1000 స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు నిర్మాత సొహైల్ ఖాన్ ప్లాన్ చేశాడు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, చైనీస్ నటి చూచూనాయికగా ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ సినిమాను సల్మాన్ సొంత బ్యానర్ పై నిర్మించారు. అమెరికాలో 330 స్క్రీన్లు, లండన్ లో 215 స్క్రీన్లలో సల్మాన్ 'ట్యూబ్ లైట్' విడుదల కానుంది. స్క్రీన్స్ విషయంలో 'బాహుబలి'ని మించిన 'ట్యూబ్ లైట్' వసూళ్ల సాధనలో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.