: ఇండిగో ఎయిర్ లైన్స్ పై నిప్పులు చెరిగిన ఎంపీ గుత్తా!
ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాడి చేశారనే కారణంతో ఆయనపై పలు ఎయిలైన్స్ సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జేసీని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెనకేసుకొచ్చారు. ఎంపీల విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇండిగో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ సంస్థకు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వత్తాసు పలకడం దారుణమని అన్నారు. ఎయిర్ లైన్స్ ఉద్యోగుల పక్షాన అశోక్ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు.