: మాల్యా కేసులో లండన్‌కు అన్ని ఆధారాలు పంపించాం.. జాప్యం జరగలేదు: స్పష్టం చేసిన విదేశాంగ శాఖ


మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో బ్రిటిష్ అధికారులకు అన్ని ఆధారాలు  పంపించామని, ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగలేదని విదేశాంగ శాఖ తెలిపింది. మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆధారాలతో కూడిన అన్ని పత్రాలను గతవారం సీబీఐ పంపినట్టు ఎంహెచ్ఏ పేర్కొంది.

‘‘ఆధారాలు  పంపే విషయంలో ఎటువంటి జాప్యం జరగలేదు. సీబీఐ జూన్ 8న డాక్యుమెంట్లను ఎంహెచ్ఏకు పంపింది. విదేశాంగ శాఖ వాటిని బ్రిటిష్ అధికారులకు పంపించింది’’ అని హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ తెలిపారు. విజయ్ మాల్యా కేసులో ఆధారాలు సమర్పించేందుకు తమకు మూడునాలుగు వారాల సమయం కావాలంటూ భారత్ తరపున మాల్యా కేసును వాదిస్తున్న లండన్‌లోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ పేర్కొంది. దీంతో స్పందించిన భారత్ తాజా వ్యాఖ్యలు చేసింది. జూన్ 8నే ఆధారాలు పంపినట్టు వివరించింది. కాగా, జూన్ 13 జరిగిన విచారణలో మాల్యా బెయిలును డిసెంబరు వరకు కోర్టు పొడిగించింది.

  • Loading...

More Telugu News