: జేసీపై ట్రావెల్ బ్యాన్ విధించిన 9 విమాన యాన సంస్థలు...యూరోప్ వెళ్లిన జేసీ


టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై 9 విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని, సిబ్బందితో అభ్యంతరకరంగా వ్యవహరించారని చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ జేసీపై నిషేధం విధించింది. అనంతరం ఈ నిర్ణయానికి మరో నాలుగు విమానయాన సంస్థలు మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. మొత్తం తొమ్మిది విమాన యాన సంస్థలు ఎంపీ జేసీపై నిషేధం విధించాయి. తన వ్యవహారశైలి వివాదంగా మారిన నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ ట్రిప్ కు వెళ్లడం విశేషం. 

  • Loading...

More Telugu News