: నాకు ఇష్టమైన కెప్టెన్ దాదాయే: యువరాజ్ సింగ్


అంతర్జాతీయ క్రికెట్ లో 17 ఏళ్ల సుదీర్ఘ కాలంలో 300 వన్డేలు ఆడిన యువరాజ్‌ సింగ్‌ తనకి భారత జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ ఇష్టమైన కెప్టెన్ అని చెప్పాడు. 300వ వన్డే ఆడుతున్న సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్ బాస్టన్ లో బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందు యువీకి గంగూలీ జ్ఞాపిక బహూకరించాడు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ, దాదా తన అభిమాన సారధి అన్నాడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. అతని నాయకత్వంలోనే తన కెరీర్ లో అద్భుతంగా రాణించానని చెప్పాడు. తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే చాలని భావించానని, అదృష్టవశాత్తు సుదీర్ఘకాలంగా జట్టుతో కలిసి ఉన్నానని చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు అవసరాలు ఎంతో ముఖ్యం అని యువీ స్పష్టం చేశాడు. 

  • Loading...

More Telugu News