: చంచల్ గూడ జైలు నుంచి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విడుదల
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండులో వున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి ఈ రోజు విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు దీపక్ రెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. కాగా, హైదరాబాద్ లో చాలా చోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్టు దీపక్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా, రియల్టర్ శ్రీనివాస్ ను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డికి దీపక్ రెడ్డి అల్లుడు.