: గచ్చిబౌలి-మియాపూర్ మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు


హైదరాబాద్ లోని గచ్చిబౌలి-మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో రహదారి గుంతలమయం కావడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనికి తోడు ప్రధాన రహదారి కూడా అధ్వానంగా ఉండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News