: ‘హసీనా ది క్వీన్ ఆఫ్ ముంబయి’ టీజర్ విడుదల


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘హసీనా- ది క్వీన్ ఆఫ్ ముంబయి’ చిత్రం టీజర్ విడుదలైంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దావూద్ సోదరి పాత్రను బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పోషించింది. దావూద్ పాత్రలో శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఈ టీజర్ లో హసీనాను గాడ్ ఉమెన్ గా చూపించారు. కాగా, దావూద్ సోదరి హసీనాని ఒకప్పుడు ముంబయిలోని నాగ్ పాడా ప్రాంతంలో ‘ఆపా’గా  పిలిచేవారు. ఆ పేరు వింటే ఇప్పటికీ అక్కడి ప్రజలు వణికిపోతారట.

  • Loading...

More Telugu News