: పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ గురించి ‘మరకతమణి’ హీరోయిన్ ఏమందంటే..!
‘మరకతమణి’ చిత్రంలో ఆది పినిశెట్టి సరసన నటించిన నిక్కీ గల్రానీ ‘ఫేస్ బుక్’ వేదికగా తన అభిప్రాయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు నిక్కీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, గురించి, తమిళ హీరోలు అజిత్, విజయ్ గురించి అభిమానులు ప్రశ్నించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉందని, తాను కొత్తగా చెప్పేదేమీ లేదని చెప్పింది. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రాన్ని కచ్చితంగా చూస్తానని చెప్పిన నిక్కీ, ప్రభాస్ తో కలిసి త్వరలోనే ఓ సినిమాలో నటిస్తానని చెప్పింది. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రం చూశానని, చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ హీరోలందరూ మంచి డ్యాన్సర్లేనని, చిరంజీవి, అల్లు అర్జున్..ఇలా చాలా మంది హీరోల డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని నిక్కీ గల్రానీ చెప్పింది.